14 గ్రామాల్లో..
పాత పంటల జాతర 14 గ్రామాల గుండా సాగుతుందని డీడీఎస్ డైరెక్టర్ దివ్య పేర్కొన్నారు. 16న జాడిమల్కాపూర్, 19న జాంగార్‌బౌలితండా, 21న అర్జున్‌నాయక్‌తండా, 23న అల్గోల్, 27న రేజింతల్, 29న గుంజోటిలో జరుగుతుందన్నారు. 31 శంశల్లాపూర్, ఫిబ్రవరి 2న మల్గి, 4న హుమ్నాపూర్, 6న నాగ్వార్, 9న ఝరాసంగం, 11న బిడకన్నె గ్రామాల్లో కొనసాగుతుందని పేర్కొన్నారు. 13న మాచ్‌నూర్ గ్రామంలోని పచ్చసాలెలో ముగింపు జాతర ఉత్సవం జరుగుతుందని వివరించారు.
సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేయడానికి స్థానికంగా అనుకూలంగా ఉండే పాత పంటల రకాలను గుర్తించి వాటి సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. జాతరలో 45 గ్రామాలకు చెందిన రైతులు చర్చావేదికలో పాల్గొంటారు. 400 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుంది.
–దివ్య, డీడీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్


