వారంలో మూడు రోజులు ప్రజాబాట | - | Sakshi
Sakshi News home page

వారంలో మూడు రోజులు ప్రజాబాట

Jan 14 2026 11:21 AM | Updated on Jan 14 2026 11:21 AM

వారంలో మూడు రోజులు ప్రజాబాట

వారంలో మూడు రోజులు ప్రజాబాట

వారంలో మూడు రోజులు ప్రజాబాట

చిన్నశంకరంపేట(మెదక్‌): విద్యుత్‌ వినియోగారుల సమస్యలను పరిష్కరించడంతో పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసమే క్షేత్రస్థాయిలో ప్రజాబాట కార్యక్రమం చేపట్టినట్లు విద్యుత్‌శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ బాలస్వామి తెలిపారు. మంగళవారం చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో నిర్వహించిన ప్రజాబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వారంలో మంగళ, గురు, శనివారం ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏదైనా సమస్య తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కరిస్తామన్నారు. అనంతరం లబ్ధిదారులకు గృహజ్యోతి బాండ్లను అందించారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ నారాయణనాయక్‌, ఏడీఏ మోహన్‌బాబు, ఏఈ దినకర్‌, జంగరాయి గ్రామ సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

మెరుగైన విద్యుత్‌ కోసమే..

ఎస్‌ఈ నారాయణనాయక్‌

మెదక్‌ కలెక్టరేట్‌: మెరుగైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు జిల్లాలో విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ నారాయణ నాయక్‌ తెలిపారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ జిల్లాలో రెండు రోజులుగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి గృహజ్యోతి లబ్ధిదారులకు, రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరా పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. హవేళిఘణాపూర్‌, మెదక్‌, చిలిపిచెడ్‌, చిన్నశంకరంపేట మండలాల్లో పర్యటించినట్లు తెలిపారు. జిల్లాలో గృహజ్యోతి పథకంలో 1లక్ష 28వేల కనెక్షన్లు, వ్యవసాయానికి సంబంధించి ఒక లక్ష 11వేల కనెక్షన్లు ఉన్నట్లు తెలిపారు. వీటిలో ఇప్పటి వరకు 60శాతం లబ్దిదారులకు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మెదక్‌, తూప్రాన్‌ డీఈలు రామేశ్వర ప్రసాద్‌,, ఏడిఈ మోహన్‌ బాబు, మెదక్‌ టౌన్‌, చిన్నశంకరంపేట ఏఈలు నవీన్‌, దినకర్‌, విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ బాలస్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement