రోడ్డు ప్రమాదంలో బీఆర్‌ఎస్ నేత మృతి
ట్రాక్టర్ ఫైనాన్స్ కట్టేందుకు
వెళ్తుండగా ప్రమాదం
జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో బీఆర్‌ఎస్ నేత మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని పస్తాపూర్ గ్రామం వద్ద చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం... ఝరాసంగం మండలంలోని వనంపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరప్ప(37) బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. కాగా మంగళవారం సాయంత్రం తన ట్రాక్టర్‌కు సంబంధించి ఫైనాన్స్ డబ్బులు కట్టేందుకు గ్రామం నుంచి మోటారు సైకిల్‌పై జహీరాబాద్‌కు వెళుతున్నాడు. ఈ క్రమంలో పస్తాపూర్ గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న కుప్పానగర్‌కు చెందిన ట్రాక్టర్ అతడ్ని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. కాగా మృతుడికి భార్య, ఐదుగురు కుమార్తెలు. స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


