ధ్వంసమైన కుంట కట్ట పరిశీలన
వట్‌పల్లి(అందోల్): అందోల్ మండల పరిధిలోని ఆశిరెడ్డికుంట కట్టను ధ్వంసం చేసి సాగు చేయడంపై ఈ నెల 12న సాక్షి దినపత్రికలో ‘ఆశిరెడ్డి కుంట కట్ట ధ్వంసం..’అనే శీర్షికతలో కథనం ప్రచురితమైంది. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులు మంగళవారం ధ్వంసం చేసిన కుంట కట్టను పరిశీలించారు. సదురు భూ యజమాని అక్కడ లేకపోవడంతో అతని వివరాలను అక్కడ పనిచేయిస్తున్న మోహిన్‌ను అడిగి తెలుసుకున్నారు. కుంట శిఖం భూమిలో పట్టాలు కలిగి ఉన్నప్పటికీ కట్టను ధ్వంసం చేయడం చట్టరీత్య నేరమన్నారు. వెంటనే భూ యజమానిని పిలిపించి ధ్వంసమైన కట్టను యథాస్థితికి చేర్చేలా పనులు చేపట్టాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గతంలో ఇదే భూమిని కొనుగోలు చేసిన ఓ వ్యక్తి కుంటలోని నీటిని బయటకు పంపించే ప్రయత్నంలో తూమును ధ్వంసం చేయడంతో కేసులు నమోదు చేసినట్లు వారికి గుర్తు చేశారు.
సరిచేయకుంటే
కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక


