మహిళ మృతదేహం లభ్యం
కొల్చారం(నర్సాపూర్): పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో.. ఎముకల గూడుతో కూడిన మహిళా మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన కొల్చారం మండల కేంద్రంలోని రిజర్వ్ ఫారెస్ట్ కాల్వ పక్కన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహమ్మద్ మైనొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 7 గంటల ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనుక భాగంలో చింతల కిష్టయ్య భూమి పక్కనే ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ కాల్వ వద్ద కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం ఉన్నట్లు గమనించారు. మృతురాలి వయస్సు 45 నుంచి 50 వరకు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. 15 రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే ఫోన్‌నంబర్: 8712657919, 8712657916లకు సంప్రదించాలని కోరారు.
పెద్దశంకరంపేట(మెదక్): ఈజీ మనీకి, జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగతం చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ.ప్రవీణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వట్‌పల్లి మండలం పల్వట్లకు చెందిన బేగరి సాయిలు కొంతకాలంగా బైక్‌లను దొంగతనం చేస్తున్నాడు. గత ఏడాది ఏప్రిల్‌లో పెద్దశంకరంపేటలో టీఎస్35–బి242తో పాటు నవీపేట మండలంలో ఒక బైక్, పంజాగుట్టలో మరో బైక్‌ను దొంగిలించాడు. శంకరంపేటలో బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా వాహనాలు దొంగతనం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. రెండు బైక్‌లను స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ.సంగమేశ్వర్, సిబ్బంది రామ్‌సింగ్, రమేష్ తదితరులు ఉన్నారు.
చేపల వల చుట్టుకొని
వ్యక్తి మృతి
నర్సాపూర్ రూరల్: చేపల కోసం తాను వేసిన వల చుట్టుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నర్సాపూర్ మండలం తుజాల్‌పూర్‌లో మంగళవారం చోటచేసుకుంది. ఎస్‌ఐ రంజిత్ కుమార్ కథనం ప్రకారం.. తుజాల్‌పూర్ గ్రామానికి చెందిన బర్ల శ్రీశైలం(40) వేకువ జామున గ్రామ సమీపంలోని దామర చెరువుకు చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపల కోసం వల వేయగా.. తాను వేసిన వల తనకే చుట్టుకొని నీటిలో మునిగి మృతి చెందాడు. ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్తులు చెరువు కట్టపై శ్రీశైలం బట్టలు, చెప్పులు, సెల్‌ఫోన్ కనిపించగా.. గాలించారు. శ్రీశైలం మృతదేహాన్ని బయటకు తీశారు.
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చేగుంట(తూప్రాన్): గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని రెడ్డిపల్లి కాలనీ బైపాస్ రోడ్డుపై మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి కథనం ప్రకారం.. రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. వ్యక్తికి సంబంధించిన బంధువులు చేగుంట పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ సూచించారు.
పతంగి ఎగరేద్దాం..
జాగ్రత్తలు పాటిద్దాం..
జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మహిళ మృతదేహం లభ్యం


