నవజాత శిశువు మరణాలు తగ్గించాలి
సంగారెడ్డి: నవజాత శిశువుల మరణాల సంఖ్యను తగ్గించాలని జిల్లా వైద్యాధికారి వసంతరావు అధికారులకు సూచించారు. సోమవారం హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగా డీసీహెచ్‌ఎస్, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్, ప్రోగ్రాం ఆఫీసర్‌తో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాలో నవజాత శిశువుల మరణాల సంఖ్యను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి 1,000 జననాల్లో 18 మంది నవజాత శిశువులు మరణిస్తున్న సంఖ్యను 10 వరకు తగ్గించాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ డాక్టర్ షరీఫ్, ఏరియా హాస్పిటల్ సూపరి ంటెండెంట్, పీడియాట్రీషియన్స్, గైనకాలజిస్ట్, డాక్టర్ నాగనిర్మల, డాక్టర్ శశాంక్ పాల్గొన్నారు.


