నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి
ఆర్‌అండ్‌బీ డీఈఈ రవీందర్
మునిపల్లి(అందోల్): రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆర్‌అండ్‌బీ డీఈఈ రవీందర్ సూచించారు. మండలంలోని పెద్దచల్మెడ శివారులో నిర్మిస్తున్న బీటీ రోడ్డును సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అలాగే మక్తక్యాసారం డబుల్‌రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. అలాగే తాటిపల్లి నుంచి మక్తక్యాసారం వరకు రోడ్డు నిర్మాణానికి రూ.20 కోట్లు, తక్కడపల్లి గార్లపల్లి మధ్య సింగూర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో బ్రిడ్జి ఏర్పాటుకు రూ.17 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. వాటి పనులు ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఏఈ భరత్, మక్సూద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
టీజీడీడీసీఎఫ్ జీఎం మధుసూదన్‌రావు
జహీరాబాద్ టౌన్: పాడి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య రాష్ట్ర జీఎం మధుసూదన్‌రావు అన్నారు. పట్టణంలో పాలశీతలీకరణ కేంద్రంలో సోమవారం మహిళా పాడి రైతులకు ముగ్గుల పోటీలు, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. పాడి రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పీఎంఈజీపీ స్కీమ్‌ను తీసుకొచ్చిందని చెప్పారు. ఈ పథకం ద్వారా రూ.20 లక్షల వరకు రుణ సహాయం అందుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు గరిష్టంగా 35 శాతం సబ్సిడీ వస్తుందన్నారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీసీసీ బ్యాంక్ జనరల్ మేనేజర్ జనార్దన్ మాట్లాడుతూ పాడి రంగంపై ఆధారపడిన రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తామని చెప్పారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే బ్యాంకుల మనుగడ ఉందన్నారు. అనంతరం మహిళలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో విజయడైరీ డీడీ ఏజీఎం సంగమేశ్వర్, బ్యాంక్ మేనేజర్ పవన్ కుమార్, మిల్క్ చిల్లింగ్ సెంటర్ మేనేజర్ డేవిడ్‌రాజ్, పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మాణిక్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు: గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు మెరుగైన ప్రదర్శనలతో జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక కావడం సంతోషకరమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నా రు. జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 కబడ్డీ పోటీలలో నాలుగో స్థానం సాధించిన తెలంగాణ జట్టుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో సోమవారం సాయ ంత్రం నిర్వహించిన సమావేశంలో వారిని సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడలకు పటాన్‌చెరును కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు హనుమంత్‌రెడ్డి, జట్టు మేనేజర్ గోపాల్, పృథ్వీరాజ్ పాల్గొన్నారు.
స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద
పటాన్‌చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన 164వ జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామి వివేకానంద తన ప్రసంగాలతో యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పారని కొనియాడారు.
నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి
నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి


