బాలలను బడికి పంపించాలి | - | Sakshi
Sakshi News home page

బాలలను బడికి పంపించాలి

Jan 13 2026 7:23 AM | Updated on Jan 13 2026 7:23 AM

బాలలను బడికి పంపించాలి

బాలలను బడికి పంపించాలి

మెదక్‌ మున్సిపాలిటీ: బాలలను బడికి పంపేలా ప్రోత్సహించాలని, కార్మికులుగా మార్చొద్దని అదనపు ఎస్పీ మహేందర్‌ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆపరేషన్‌ స్మయిల్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి జిల్లాలో చేపట్టిన కార్యక్రమానికి అన్ని శాఖల సమన్వయం బాగుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 26 మంది బాలలను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించగా, 9 మంది పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 28 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి, డీసీఆర్బి ఇన్‌స్పెక్టర్‌ కృష్ణమూర్తి, శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆపరేషన్‌ స్మయిల్‌ సమావేశంలో

అదనపు ఎస్పీ మహేందర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement