రైస్‌మిల్లుపై విజిలెన్స్ దాడులు
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని రైస్‌మిల్లులపై రాష్ట్ర విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర విజిలెన్స్ టీం అధికారులు సోమవారం ఉదయం సూరారం నుంచి అశోక్ లేలాండ్ ఆటోలో తీసుకొచ్చిన 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం కొంతన్‌పల్లిలోని శ్రీ ఆంజనేయ రైస్‌మిల్లులో అన్‌లోడింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. అనంతరం రైస్‌మిల్లులో రాష్ట్ర విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ పండరి, జిల్లా విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ నర్సింలు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా మొత్తం కలిపి 204 క్వింటాళ్ల రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించి స్వాఽధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం తెచ్చిన లింగం గుప్తా, ఆటో డ్రెవర్ రామస్వామి, రైస్‌మిల్ యజమాని సత్యంపై కేసు నమోదు చేశారు.
204 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం


