పండ్లసాగుపై అధ్యయన పర్యటన | - | Sakshi
Sakshi News home page

పండ్లసాగుపై అధ్యయన పర్యటన

Jan 13 2026 7:23 AM | Updated on Jan 13 2026 7:23 AM

పండ్లసాగుపై అధ్యయన పర్యటన

పండ్లసాగుపై అధ్యయన పర్యటన

సంగారెడ్డి: మాల్దీవులకు చెందిన 30 మంది పాలన అధికారులు ఫ్రూట్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌)ను సోమవారం సందర్శించారు. వారు భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ, మాల్దీవుల ప్రభుత్వం ఆధ్వర్యంలో , జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ( ఎన్‌ఐఆర్‌డి ) సహకారంతో నిర్వహించిన అధ్యయన పర్యటనలో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్రూట్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ శాస్త్రవేత్తలు.. మామిడి, జామ, సీతాఫలం ఇతర పండ్ల సాగు విధానాలు, వాటికి తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. అలాగే నర్సరీలో మొక్కల పెంపకం, అంటుకట్టు పద్ధతులపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఫ్రూట్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ ప్రధాన శాస్త్రవేత్త కె.వెంకటలక్ష్మి, శాస్త్రవేత్తలు పి.హరికాంత్‌, కె.మౌనిక, బి.నవీన్‌ కుమార్‌, శిరీష, అరుల్‌ రాజ్‌ పాల్గొన్నారు.

ఎఫ్‌ఆర్‌ఎస్‌ను సందర్శించిన మాల్దీవుల బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement