మూత్ర విసర్జనకు వెళ్లి.. | - | Sakshi
Sakshi News home page

మూత్ర విసర్జనకు వెళ్లి..

Jan 13 2026 7:23 AM | Updated on Jan 13 2026 7:23 AM

మూత్ర విసర్జనకు వెళ్లి..

మూత్ర విసర్జనకు వెళ్లి..

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

కొల్చారం(నర్సాపూర్‌): మూత్ర విసర్జనకు వెళ్లిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామపంచాయతీ వడ్డెర కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహమ్మద్‌ మైనొద్దీన్‌ వివరాల ప్రకారం... కాలనీకి చెందిన ముద్దంగుల నర్సింహులు(43) రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో మూత్ర విసర్జనకు గ్రామంలోని పోచమ్మ గుడి వెనకాల ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ పక్కకు వెళ్లాడు. ఈ క్రమంలో కాలుజారి ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నర్సింలును మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌

లేనివారికి జరిమాన

సిద్దిపేటకమాన్‌: డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన వారికి, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపిన వారికి సిద్దిపేట కోర్టు జరిమాన విధించింది. ట్రాఫిక్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ వివరాల ప్రకారం... పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో 15మంది మద్యం తాగి, 17మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని సోమవారం కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి వారికి రూ.2,38,500 జరిమాన విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement