కుమ్మరులు ఐక్యంగా ఉండాలి
రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ రావు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్రంలోని కుమ్మరుల అభివృద్ధికి రాష్ట్ర కుమ్మరుల సంఘం అధ్యక్షుడు జయంత్‌రావు అన్నారు. ఆదివారం రంగదాంపల్లి వద్ద ప్రధాన కార్యదర్శి దయానంద్‌తో పాటు ఆయనకు జిల్లా కుమ్మరుల సంఘం సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కుమ్మరులంతా ఐక్యంగా ఉండాలన్నారు. అన్ని రంగాల్లో ముందుకు సాగాలన్నారు. అనంతరం రాష్ట్ర కమిటీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకరయ్య, యాదయ్య, అశోక్, తరిగొప్పుల రామచంద్రం, దరిపల్లి బాలచంద్రం, వరికోలు రాజలింగం, మూడపల్లి భూమయ్య, ఆంజనేయు లు, రమేశ్, కుకునూరుపల్లి రమేశ్, చందు, వెంకటేశ్, తిమ్మాపురం శేఖర్ పాల్గొన్నారు.


