సత్ఫలితాలిచ్చిన దుప్పట్ల సేకరణ
● సంక్షేమ హాస్టళ్లకు 2,498 పంపిణీ ● దాతలకు కృతజ్ఞతలు తెలిపిన కలెక్టర్
మెదక్ కలెక్టరేట్: సంక్షేమ హాస్టళ్లలోని పేద విద్యార్థు ల సంక్షేమానికి చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని మెదక్ కలెక్టర్ రాహురాల్ ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్స రం సందర్భంగా తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరూ హాస్టళ్లలోని పేద విద్యార్థుల కోసం దుప్పట్లు తీసుకురావాలని పిలుపునివ్వడంతో నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు స్పందించినట్లు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 2,498 దుప్పట్లు అందజేయగా.. వాటిని జిల్లాలోని 17 బీసీ, 6 ట్రైబల్ సంక్షేమ హాస్టళ్లలోని 2,488 మంది విద్యార్థులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.


