గురుకులం పిలుస్తోంది | - | Sakshi
Sakshi News home page

గురుకులం పిలుస్తోంది

Jan 12 2026 8:12 AM | Updated on Jan 12 2026 8:12 AM

గురుక

గురుకులం పిలుస్తోంది

● ఫిబ్రవరి 22న పరీక్ష ● ఈ నెల 21 దరఖాస్తుకు ఆఖరి తేదీ ● ఉమ్మడి జిల్లాలో 80 పాఠశాలలు

ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2025–2026లో నాలుగో తరగతి చదువుతుండాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు 9 నుంచి 13 సంవత్సరాల వయస్సు కల్గి ఉండాలి.

ప్రవేశ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఓఎంఆర్‌ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు.

ప్రశ్న పత్రం తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో ఉంటుంది.

పరీక్షలో తెలుగు 20 మార్కులు, ఇంగ్లిష్‌ 25 మార్కులు, గణితం 25 మార్కులు, మెంటల్‌ ఎబిలిటీ 10 మార్కులు, ఇతర 20 మార్కులు నాలుగో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి.

సమాచారం కోసం 040–23391598, 83338 00221 హెల్ప్‌ లైన్‌ నంబర్‌ను సంప్రదించవచ్చు.

ఐదో తరగతిలో ప్రవేశాలకు ఆహ్వానం
● ఫిబ్రవరి 22న పరీక్ష ● ఈ నెల 21 దరఖాస్తుకు ఆఖరి తేదీ ● ఉమ్మడి జిల్లాలో 80 పాఠశాలలు

సంగారెడ్డి క్రైమ్‌: ప్రభుత్వ గురుకులాలకు 2026–2027 విద్యా సంవత్సరానికి గాను సర్కారు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ప్రవేశ పరీక్షలో మార్కుల ప్రాతిపాదికన ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి సీట్లు కేటాయిస్తారు. ఈ నెల 21 వరకు దరఖాస్తులకు చివరి తేదీ, ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షకు అర్హులు. అలాగే ప్రస్తుతం 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలు పొందవచ్చు. అర్హులైన విద్యార్థులు మీసేవ లేదా ఆన్‌లైన్‌ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

80 గురుకులాలు..7 వేల సీట్లు..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక గురుకుల్లో కలిపి మొత్తం 80 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఐదో తరగతిలో 7 వేలకు పైగా సీట్లను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 300నుంచి 500పైగా సీట్లను భర్తీ చేయనున్నారు.

మెరిట్‌ ఆధారంగా సీట్లు

గురుకుల పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి అడ్మిషన్‌ కల్పిస్తారు. ఇందులో మెరిట్‌ సాధించిన విద్యార్థులకు టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈ ఐఎస్‌, టీజీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ గురుకులాలకు ఎంపి క చేస్తారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచిత భోజన వసతి, కాస్మోటిక్‌ చార్జీలు తదిత ర సౌకర్యాలు కల్పిస్తారు.

కావల్సిన ధ్రువీకరణ పత్రాలు

గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందాలంటే ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు తమ బోనఫైడ్‌తో పాటు ప్రస్తుత పాస్‌ఫొటో, ఆధార్‌ కార్డు, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. పట్టణ ప్రాంతాల వారి ఆదాయం రూ. రెండు లక్షల లోపు ఉండాలి. అలాగే అర్బన్‌(గ్రామీణ) ప్రాంతాల వారి ఆదాయం రూ.1.50 లక్షల లోపు ఉండాలి. ఆన్‌లైన్‌లో పరీక్ష దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. అనంతరం ఆధార్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్క దరఖాస్తుకు ఒక ఫోన్‌ నంబర్‌ మాత్రమే పని చేస్తుంది.

అభ్యర్థులకు సూచనలు

సద్వినియోగం చేసుకోవాలి

ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు గురుకుల పరీక్షకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలి. మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. – రాజేశం,

రీజినల్‌ కోఆర్డినేటర్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లా

గురుకులం పిలుస్తోంది 1
1/1

గురుకులం పిలుస్తోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement