ధర్మ స్థాపనతోనే లోకం సుభిక్షం
హనుమాన్ పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ
సిద్దిపేటజోన్: సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ధర్మ స్థాపన ద్వారానే లోకం సుభిక్షంగా ఉంటుందని అఖిల భారత హనుమాన్ పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీ జీ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆర్య వైశ్య భవనంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....లోక కళ్యాణార్థం సమాజం సుభిక్షంగా ఉండాలనే సదుద్దేశంతో కోటి హనుమాన్ చాలీసా పారాయణ సంకల్పం చేపట్టినట్టు పేర్కొన్నారు. విజయవాడ లో హనుమాన్ దేవాలయ పునః ప్రతిష్ట జరుగుతుందని వివరించారు. హనుమాన్ వైభవం అందరి కి అందాలనే సంకల్పంతో 108 గ్రామాల సందర్శన చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 25న రథ సప్తమి సందర్భంగా కండ్లకోయ ఆశ్రమంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి 108 గ్రామాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రామ, హనుమాన్ దీక్ష కమిటీ ప్రతినిధులు పరమేశ్వర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


