నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బల్దియా డివిజన్ల ఏర్పాటులో శాసీ్త్రయత లోపించిందని 1.20లక్షల ఓటర్లున్న అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలో కేవలం రెండు డివిజన్లనే ఏర్పాటు చేయడం ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయలను ప్రతిబింబించేలా మరో రెండు డివిజన్లను ఏర్పాటు చేయాలని..లేనిపక్షంలో జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కిష్టారెడ్డిపేట గ్రామంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆదివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సందర్శించారు. వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమావేశంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ఆయా గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అఖిలపక్ష బృందం సభ్యులు పాల్గొన్నారు.
బడుగులకు అండగా ఉండాలి
నారాయణఖేడ్: అన్ని శాఖల ఉద్యోగులు, ప్రజా సంఘాలు పరస్పరం సహకరించుకుంటూ బడుగు, బలహీనవర్గాల ప్రజలకు అండగా ఉండాలని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కార్యదర్శి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ఖేడ్‌లో అంబేడ్కర్ ఫూలే సేవాసమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పండరి, రక్షణశాఖ సంఘం నాయకులు గోపాల్ నాయక్, లక్ష్మణ్, రెవిన్యూశాఖ సంఘం నాయకులు సుభాష్ తదితరులతో ఆదివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చాలా సంఘాలు తమతమ హక్కుల సాధన కోసమే పనిచేస్తున్నాయన్నారు. సామాజిక కోణంలో పేదలకు సహాయ, సహకారాలు అందించడానికి శ్రద్ధచూపాలని కోరారు. అన్నిశాఖల ఉద్యోగులు వేతనంలో అయిదు శాతం సమాజాభివృద్ధికి కేటాయించాలని కోరారు.
బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించాలి: పద్మ
సంగారెడ్డి: బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేయాలని బీసీ సంఘం రాష్ట్ర మహిళా కమిటీ అధ్యక్షురాలు పద్మ పిలుపునిచ్చారు. వైయస్సార్ భవన్‌లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశానికి పద్మ హాజరై మాట్లాడారు. పట్టణ, మండల అధ్యక్షుల కమిటీ వేయాలని కోరారు. మహిళా కమిటీలను బలోపేతం చేయాలన్నారు. బీసీ సంఘం జాతీయ ప్రధానకార్యదర్శి అనురాధగౌడ్ మాట్లాడుతూ..త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలుచేయాలన్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి ఇంటినిర్మాణానికి ఇందిరమ్మ పథకం కింద రూ.5లక్షలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు ప్రభుగౌడ్, ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ, నాగరాణి, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గుమ్మడిదలలో రక్తదాన శిబిరం
జిన్నారం (పటాన్‌చెరు): స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా గుమ్మడిదల పట్టణ కేంద్రలో మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నగరానికి చెందిన నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తలసేమియా వ్యాధి పిల్లలకు, గర్భిణీల కోసం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈ శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, సినీ నటి కరాటే కల్యాణి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. తల సేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేసిన యువకులను, చైర్మన్ ఉదయ్ కుమార్‌ను వారు అభినందించారు.
నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే
నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే


