అర్హులందరికీ ఇళ్ల స్థలాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు

Jan 12 2026 8:09 AM | Updated on Jan 12 2026 8:09 AM

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు

సదాశివపేట(సంగారెడ్డి): పట్టణంలో ఇళ్ల స్థలాలు లేని అర్హులైన నిరుపేదలందరికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుందని టీజీఐఐసీ చైర్‌ పర్సన్‌ తూర్పు నిర్మలారెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలుతోపాటు అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారన్నారు. మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ చిరు ఆధ్వర్యంలో పట్టణంలోని వీరబద్రియ కుల సంఘం ప్రజలు ఆదివారం టీజీఐఐసీ చైర్‌ పర్సన్‌ తూర్పు నిర్మలారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గృహాజ్యోతి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ గృహా నిర్మాణ పథకం వంటి పథకాలు అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి సహకారంతో వీరబద్రియ సంఘం భవన నిర్మాణానికి నిధులు, స్మశాన వాటిక స్థలం మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్‌ రాంరెడ్డి, వీరబద్రీయ కులసంఘం అద్యక్షులు యాదగిరి, ప్రధాన కార్యదర్శి కుమార్‌ పాల్గొన్నారు.

టీజీఐఐసీ చైర్‌ పర్సన్‌ తూర్పు నిర్మలారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement