పెద్దరెడ్డిపేట లిఫ్ట్ ప్రతిపాదనలు ఇవ్వండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఆందోల్ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగు నీరు అందించే పెద్దరెడ్డి ఎత్తిపోతల పథకం అంచనాలు వెంటనే రూపొందించాలని మంత్రి దామోదర రాజనర్సింహ నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో జిల్లా నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...సింగూర్ కాల్వల మరమ్మతులు, లైనింగ్ పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఖరీఫ్‌కు ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నారు. సింగూరు నీటిని వృథా చేయకుండా జెన్‌కో ద్వారా విద్యుత్ ఉత్పత్తితోపాటు దిగువన ఉన్న ఘన్‌పూర్ ఆయకట్టుకు, నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని తరలించాలన్నారు. సమీక్షలో ఈఎన్‌సీ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జైభీమ్, ఇంజనీర్లు రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
నీటిపారుదలశాఖ అధికారులకు
మంత్రి దామోదర ఆదేశం


