పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి
న్యాయ సేవాధికార
సంస్థ కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డి టౌన్: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని శిశుగృహ, సఖీ కేంద్రాలను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ..శిశుగృహ, సఖీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. న్యాయపరమైన విషయంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. అనంతరం సఖీ కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. కందిలోని సెంట్రల్ జైలులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.


