నేటి నుంచి సంక్రాంతి సెలవులు
న్యాల్‌కల్(జహీరాబాద్): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు ఏడు రోజులపాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలు 17వ తేదీన పునఃప్రారంభమవుతాయని వెల్లడించారు. సెలవు రోజుల్లో పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జాబ్ క్యాలెండర్
విడుదల చేయాలి
టీజీపీఎస్సీ చైర్మన్‌కు ఎమ్మెల్సీ అంజిరెడ్డిలేఖ
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగ యువత తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. స్థానిక విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ...జాబ్ క్యాలెండర్ లేకపోవడంతో నియామక ప్రక్రియల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థగా టీజీపీఎస్సీ పారదర్శకంగా, సమయానుకూలంగా వ్యవహరించి అభ్యర్థుల్లో మరింత నమ్మకం పెంచాల్సినవసరం ఉందని తెలిపారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయని పక్షంలో నిరుద్యోగుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్‌తోనే ప్రజాసంక్షేమం
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం
పటాన్‌చెరు టౌన్: M>…{VðS‹Ü ´ëÈ-t-™ø¯ól {ç³gê-çÜ…-„óSÐ]l$… Ýë«§ýlÅÐ]l$° GïÜÞ M>ÆöµÆó‡-çÙ¯ŒS O^ðlÆý‡Ã¯ŒS {ï³™èl… õ³ÆöP-¯é²Æý‡$. Ð]l¬™èl¢…W yìlÑ-f¯ŒS ç³Ç-«¨ÌZ° M>…{VðS‹Ü ´ëÈt GïÜÞ yìl´ë-Æý‡Š-ె-r-Ã…sŒæ gê¡Ä¶æ$ A«§ýlÅ-„ýS$Ë$ Æ>gôæ…{§ýl-´ë-ÌŒæ-™ø-´ër$ M>…{VðS‹Ü ¯éĶæ$-MýS$-ÌS™ø Ô¶æ${MýS-ÐéÆý‡… °Æý‡Óíßæ…_¯]l çÜÐ]l*Ðól-Ôèæ…ÌZ {ï³™èl… ´ëÌŸY° Ð]l*sêÏ-yéÆý‡$. A…™èl-MýS$Ð]l¬…§ýl$ sîæï³ïÜïÜ Æ>çÙ‰ GïÜÞ òÜÌŒæ MýS±-Ó-¯]lÆŠ‡ §ýl…yøÆ> ¯]lÆý‡íÜ…çßæ-™ø´ër$ ¯éĶæ$-MýS$Ë$ Ð]l¬QÅ A†£ýl$-ÌS¯]l$ çܯéÃ-°…-^éÆý‡$. D çÜ…§ýlÆý‡Â…V> ÐéÆý‡$ Ð]l*sêÏ-yýl$-™èl*...-Æ>»ZÄôæ$ Ð]l¬°Þ´ë-Ísîæ,-G…-ï³-sîæïÜ, gñæyîlµ-sîæïÜ,-i-òßæ-^Œl-G…ïÜ G°²MýSÌZÏ ´ëÈt ^ólç³-yýl$-™èl$¯]l² çÜ…„óSÐ]l$ ç³£ýl-M>-ÌS¯]l$ {ç³f-ÌSMýS$ ÑÐ]l-Ç…-_, ´ëÈt ºÌSç³-Ç-_¯]l A¿ýæÅ-Æý‡$¦-ÌS¯]l$ VðSÍ-í³…-^éÌS° MøÆ>Æý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ ´ëÈt ïܰ-Ķæ$ÆŠ‡ ¯éĶæ$-MýS$Ë$, ĶæÊ™Œæ M>…{VðS‹Ü ¯éĶæ$-MýS$Ë$ ™èl¨-™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.
జాబ్ మేళాలో
79 మందికి ఉద్యోగాలు
పటాన్‌చెరు టౌన్: పటాన్‌చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 79 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ విలేకరులకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ మెగా జాబా మేళాలో 13 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించగా సుమారు 200 మంది హాజరయ్యారని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికై న వారికే అక్కడే నియామక పత్రాలను అందజేసినట్లు వివరించారు. కార్యక్రమం కళాశాల టీఎస్‌కేసీ కో ఆర్డినేటర్ విమల,అధ్యాపకుడు డాక్టర్, ఎన్.యోగిబాబు పాల్గొన్నారు.


