తంజావూరు చిత్రకళను కాపాడుకోవాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: తంజావూరు పెయింటింగ్ అరుదైన కళని దానిని కాపాడుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. విద్యార్థులు వేసిన తంజావూరు పెయింటింగ్స్ అభినందనీయమని కలెక్టర్ ప్రశంసించారు. సంగారెడ్డి తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తంజావూరు పెయింటింగ్స్‌పై నాలు గు రోజుల పాటు జరిగిన సర్టిఫికెట్ కోర్సు శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశానికి శుక్రవారం కలెక్టర్ హాజరై మాట్లాడారు. సోలాపూర్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ జ్ఞాన ప్రబోధిని, మల్లికార్జున హైస్కూల్, రాకంబాయి హత్తురే జూనియర్ కళాశాల, సోలాపూర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణలో ప్రొఫెసర్ మల్లికార్జున బిరాజ్ దార్ విద్యార్థులకు పెయింటింగ్ మెళకువలు నేర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీ ణ్య మాట్లాడుతూ..తంజావూరు పెయింటింగ్ కళలను కాపాడటం కోసం కళాశాలలో ఈ సర్టిఫికెట్ కోర్సును నిర్వహించారన్నారు. ఈ కళల ద్వారా విద్యార్థులకు మానసిక స్థిరత్వంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పెంపొందించుకోవచ్చని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ, వైస్ ప్రిన్సిపల్స్ నిర్మల, డాక్టర్ జగదీశ్వర్ అర్థశాస్త్ర విభాగ అధ్యాపకురాలు డాక్టర్ అనురాధజ్ఞాన ప్రబోధిని కి చెందిన మురళి తదితరులు పాల్గొన్నారు.


