అర్హులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
నారాయణఖేడ్: అర్హులైన పేదలకు జూకల్ శివారులో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను త్వరలో అందజేయనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సీసీరోడ్లు, మురుగుకాల్వల నిర్మాణాలకు శుక్రవారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. పలు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ..795 డబుల్‌బెడ్ రూం ఇళ్లకు అర్హుల గుర్తింపు 50% పూర్తయ్యిందని, మిగతా వారిని గుర్తించి మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తి కాగానే అందజేస్తామన్నారు. గతంలో ఇళ్ల పట్టాలు పొందిన వారిలో అర్హులు ఉన్నవారికి కూడా ఇళ్లను కేటాయిస్తామని తెలిపారు. అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఖేడ్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, గృహనిర్మాణశాఖ డీఈఈ తివారీ, ఏఈలు, నాయకులు నర్సిహ్మారెడ్డి, దారం శంకర్, పండరిరెడ్డి పాల్గొన్నారు.
నిధులకోసం కలెక్టర్‌కు వినతి
నారాయణఖేడ్: ఖేడ్ పట్టణం చుట్టూ నిర్మిస్తున్న రింగు రోడ్డు నిర్మాణానికి, నియోజకవర్గంలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కలిసి కోరారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, మాజీ ఎంపీటీసీ పండరీరెడ్డి ఉన్నారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి


