పార్టీ కోసం కష్టించేవారికే పదవులు | - | Sakshi
Sakshi News home page

పార్టీ కోసం కష్టించేవారికే పదవులు

Jan 10 2026 9:40 AM | Updated on Jan 10 2026 9:40 AM

పార్టీ కోసం కష్టించేవారికే పదవులు

పార్టీ కోసం కష్టించేవారికే పదవులు

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

సదాశివపేట(సంగారెడ్డి): పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు వరిస్తాయని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలారెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలోని బాలాజీ ఫంక్షన్‌ హాలులో శుక్రవారం జరిగిన సదాశివపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటిటీ చైర్‌పర్సన్‌ అలవేణి ప్రమాణస్వీకార మహోత్సవానికి జగ్గారెడ్డి, నిర్మలారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...వ్యవసాయానికి సంబంధించి సమస్యలుంటే మార్కెట్‌ చైర్‌పర్సన్‌తో చర్చించి పరిష్కరించుకోవాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రి సంగారెడ్డికి రానున్నారని మార్కెట్‌ సమస్యలను పరిష్కరించుకుందామని తెలిపారు. రైతులకు మెరుగైన సేవలందించడానికే మార్కెట్‌ కమిటీ ఉందని రైతులందరు సద్వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ ప్రభు, సీడీసీ చైర్మన్‌ రాంరెడ్డి, మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు కంది కృష్ణ, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ మండల అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, చాట్ల సిద్దన్న, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement