టెట్ నుంచి మినహాయించాలి
కంది (సంగారెడ్డి): సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ డిమాండ్ చేశారు. విద్యా ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతూ శుక్రవారం కంది మండలం చేర్యాలలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ.. ఏఐజేఏసీటీవో పిలుపుమేరకు ఉపాధ్యాయుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నామన్నారు. ఎస్‌జీటీ లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని, కొత్త పింఛను విధానాన్ని రద్దుచేసి పెన్షన్ భద్రత నిచ్చే పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థుల విద్యను ప్రశ్నార్థకం చేసే పాఠశాలల మూసివేత నిర్ణయాలను రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్: అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నారాయణ్ ఖేడ్ మండల పరిధిలోని అనంతసాగర్ పాఠశాల వద్ద టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన


