సీనియర్ జర్నలిస్టు మృతి
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు ఫజల్ రహమాన్ (60)అనారోగ్యంతో మృతి చెందారు. పది రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన ప్రస్తుతం ప్రతిపక్షం దిన పత్రికలో ఎడిటర్‌గా పని చేస్తున్నారు. కాగా ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. ఇద్దరు కుమారులు పత్రికా రంగంలోనే పని చేస్తున్నారు. ఆయన మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్, హుస్నాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పిట్టల తిరుపతి, నన్నె అజయ్, స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.


