షార్ట్‌ సర్క్యూట్‌తో చెరుకు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో చెరుకు దగ్ధం

Jan 10 2026 9:40 AM | Updated on Jan 10 2026 9:40 AM

షార్ట

షార్ట్‌ సర్క్యూట్‌తో చెరుకు దగ్ధం

రూ.2.50 లక్షల నష్టం

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): చెరుకు పంటకు నిప్పంటుకొని నాలుగు ఎకరాలు దగ్ధమైంది. దీంతో రూ.2.50 లక్షలు మేర నష్టం వాటిల్లింది. వివరాలు ఇలా... మండల పరిధిలోని మామిడ్గి గ్రామ శివారులో శుక్రవారం ఎప్పటిలాగే రైతు రాజశేఖర్‌రెడ్డి శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో చెరుకు తోటకు నిప్పంటుకొని మంటలు ఎగిసిపటడం గమనించిన రైతు తోటి రైతులతో కలిసి జహీరాబాద్‌లోని ఫైరింజన్‌కు సమాచారం ఇచ్చాడు. ఫైరింజిన్‌ వచ్చే సరికి దాదాపు చెరుకు తోట కాలిపోయింది. అయితే సమీపంలో తోటలకు మంటలు వ్యాపించకుండా ఫైరింజిన్‌ మంటలను ఆర్పి వేసింది. షార్ట్‌ సర్క్యూట్‌తోనే మంటలు చెలరేగి నిప్పంటుకున్నట్లు బాధిత రైతు తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

చైనా మాంజా సీజ్‌

హత్నూర( సంగారెడ్డి): ప్రమాదకరమైన చైనా మాంజాను విక్రయిన్న వ్యక్తిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకొని, మాంజాను సీజ్‌ చేశారు. ఎస్సై శ్రీధర్‌ రెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని దౌల్తాబాద్‌ గ్రామంలో మహమ్మద్‌ వాజీర్‌ హలీ చైనా మాంజా అమ్ముతున్నాడని వచ్చిన సమాచారం మేరకు వెళ్లి షాపుని తనిఖీ చేశారు. అందులో 19 మాంజా బాబిన్‌లు, నైలాన్‌ సింథటిక్‌ చైనా మాంజాలు ఉండగా వాటిని సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన వాటిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి, అతడిపై కేసు నమోదు చేశారు. చైనా మాంజాతో ప్రాణాలు పోతాయని ఎవరైనా, అమ్మినా కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

కల్హేర్‌(నారాయణఖేడ్‌): అక్రమంగా తరలిస్తున్న 200 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కల్హేర్‌ ఎస్‌ఐ రవిగౌడ్‌ వివరాల ప్రకారం... అక్రమంగా రేషన్‌ బియ్యం లారీలో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు రంగంలోకి దిగారు. శుక్రవారం మండలంలోని మాసాన్‌పల్లి చౌరస్తాలో సంగారెడ్డి–నాందేడ్‌ 161 నేషనల్‌ హైవే వద్ద రాజారాం దాబా సమీపంలో లారీని పట్టుకున్నారు. కర్ణాటకలోని బీదర్‌ నుంచి నిజాంసాగర్‌ వైపు తరలిస్తున్నారని విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకుని సివిల్‌ సప్లయ్‌ అధికారులకు బియ్యం అప్పగించినట్లు తెలిపారు.

అధికారుల పనితీరు భేష్‌

జెడ్పీ సీఈఓ ఎల్లయ్య

మనోహరాబాద్‌(తూప్రాన్‌): ఎన్నికల్లో భాగంగా మండలంలో అధికారుల పనితీరు బాగుందని జిల్లా జెడ్పీ సీఈఓ ఎల్లయ్య పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పంచాయతీ అధికారులు పరిశుభ్రత, పచ్చదనం, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో చెరుకు దగ్ధం1
1/2

షార్ట్‌ సర్క్యూట్‌తో చెరుకు దగ్ధం

షార్ట్‌ సర్క్యూట్‌తో చెరుకు దగ్ధం2
2/2

షార్ట్‌ సర్క్యూట్‌తో చెరుకు దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement