జాతీయస్థాయి హాకీ పోటీలకు విద్యార్థి
దుబ్బాకటౌన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ –19 జాతీయ స్థాయి హాకీ పోటీలకు దౌల్తాబాద్ మహాత్మ జ్యోతి బాపూలే బాలుర కళాశాల విద్యార్థి చరణ్ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ స్వప్న తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల సరూర్ నగర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికయ్యాడని చెప్పారు. ఈనెల 12న రాజస్థాన్ ఉదయపూర్‌లో జరిగే పోటీల్లో తెలంగాణ హాకీ జట్టు తరఫున పాల్గొంటారన్నారు. విద్యార్థి జాతీయ స్థాయిలో ఎంపిక కావడానికి శిక్షణనిచ్చిన కళాశాల పీడీ సాయికృష్ణ, పీఈటీలు డాంబు, బసవరాజులను అభినందించారు.
అథ్లెటిక్స్‌కు ఎంపికై న చిట్కుల్ విద్యార్థులు
చిలప్‌చెడ్(నర్సాపూర్): ఈ నెల 18న ఆదిలాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మండలంలోని చిట్కుల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని పీడీ సుజాత తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ ఈ నెల 8న మెదక్ పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో విద్యార్థులు అండర్–12 విభాగంలో నవదీప్ 60 మీటర్లు, 400మీటర్ల రన్నింగ్, లాంగ్‌జంప్‌లలో ప్రథమస్థానం సాధించాడు. మరో విద్యార్థి లోహిత్, షార్ట్‌ఫుట్‌లో 2వ స్థానం, 400 మీటర్ల రన్నింగ్, లాంగ్‌జంప్‌లో 3వ స్థానం సాధించాడు. అండర్–14 విభాగంలో సతీశ్ ట్రయాథ్లాన్ (రన్సింగ్, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్)లో 2వ స్థానం సాధించి, రాష్ట స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులను హెచ్‌ఎం నాగరాజు, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.
జాతీయస్థాయి హాకీ పోటీలకు విద్యార్థి


