రెండేళ్ల కాంగ్రెస్ పాలన అస్తవ్యస్థం
నంగునూరు(సిద్దిపేట): దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని రైతులను, ఉద్యోగాలు లేవని నిరుద్యోగులను ఇబ్బందులు పెట్టడంతో రెండేళ్ల రేవంత్‌రెడ్డి పాలన అస్తవ్యస్థంగా మారిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం నర్మెటలోని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ఆయన సందర్శించి యంత్రాలు, గెలల ద్వారా క్రూడాయిల్, గింజల ద్వారా కెర్నల్ ఆయిల్, పిప్పి ద్వారా విద్యుత్ ఉత్పత్తి తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సిద్దిపేట జిల్లా రిజర్వాయర్ల ఖిల్లాగా మారిందన్నారు. ఈ ప్రాంతాన్ని ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలంగా మార్చడమే కాకుండా నర్మెటకు ఫ్యాక్టరీ మంజూరీ చేసి 45 ఏళ్ల కలను కేసీఆర్ సాకారం చేశారని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, సారయ్య, సోమిరెడ్డి, సర్పంచ్ స్వాతి, పలు గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే హరీశ్ రావు


