పల్లెల్లో మద్యపాన నిషేధం
ఏకగ్రీవ తీర్మానం చేసిన ప్రగతి ధర్మారం, కొల్చారం గ్రామస్తులు
Æ>Ð]l*Ķæ$…õ³-r(-Ððl$-§ýlMŠS)/MöÌêaÆý‡…(¯]lÆ>Þç³NÆŠḥ): మండలంలోని ప్రగతి ధర్మారంలో సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం గురువారం గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈమేరకు సర్పంచ్ శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో సమావేశమై చర్చించారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే రూ. 50 వేలు, కొన్నవారికి రూ. పది వేల జరిమానా విధి స్తామని స్పష్టం చేశారు. గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు పెరిగిపోవడంతో యువత మద్యానికి బానిస అవుతున్నారని వాపోయారు. మద్యం అమ్మకాలు పూర్తిగా రూపు మాపితేనే గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొంటుందని ఆశా భావం వ్యక్తం చేశారు. అలాగే దుకాణాల్లో మైనర్లకు సిగరేట్లు, గుట్కాలు, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించవద్దని హెచ్చరించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఐ బాల్‌రాజుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే కొల్చారం మండలకేంద్రంలో నూతన పాలకమండలి సర్పంచ్ దేవన్నగారి శేఖర్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈనెల 26 గణతంత్ర దినోత్సవం నాటి నుంచి గ్రామంలో పూర్తిగా మద్య నిషేధం అమలు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.


