నిఘానేత్రం.. భలే పట్టేసింది.. | - | Sakshi
Sakshi News home page

నిఘానేత్రం.. భలే పట్టేసింది..

Jan 9 2026 11:17 AM | Updated on Jan 9 2026 11:17 AM

నిఘానేత్రం.. భలే పట్టేసింది..

నిఘానేత్రం.. భలే పట్టేసింది..

చిన్నశంకరంపేట(మెదక్‌): పోయిందనుకున్న బంగారం సీసీ కెమెరా సహాయంతో పోలీసులు బాధిత మహిళకు అప్పగించారు. ఈ సంఘటన చిన్నశంకరంపేటలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నారాయణగౌడ్‌ కథనం ప్రకారం.. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌కు చెందిన పడాల సరిత కుటుంబసభ్యులతో కలిసి బుధవారం మెదక్‌లోని బంధువు అంత్యక్రియలకు హాజరయింది. తిరుగు ప్రయాణంలో గవ్వలపల్లి చౌరస్తాలోని కారు దిగి టీ తాగి బయలుదేరారు. తీరా ఇంటికి వెళ్లాక బంగారు చైన్‌ ఉన్న పర్సుపోయినట్లు గమనించారు. దీంతో బాధిత మహిళ గురువారం మధ్యాహ్నం చిన్నశంకరంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కానిస్టేబుల్‌ ప్రవీణ్‌ గవ్వలపల్లి చౌరస్తాలోని సీసీ కెమెరాలను పరిశీలించగా రోడ్డుపై పడిపోయినట్లు గుర్తించారు. ఓ వ్యక్తి పర్సును తీసుకుపోయినట్లు గుర్తించి అతని వద్దకు వెళ్లి అడగ్గా పర్సు, బంగారం తిరిగి ఇచ్చాడు. పోలీసులు బాధిత మహిళకు అప్పగించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌ ప్రవీణ్‌ను ఎస్‌ఐ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement