మంజీర నదిలో మహిళ మృతదేహం
పుల్‌కల్(అందోల్): సింగూర్ ప్రాజెక్టు దిగువన మంజీర నదిలో సదాశిపేట మండలం పొట్టిపల్లికి చెందిన వడ్డే రాములమ్మ (45) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 6వ తేదీన గ్రామం నుంచి సదాశివపేట వచ్చిన ఆమె ఇంటికి తిరిగి వెళ్లలేదు. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు బంధువులను సంప్రదించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పుల్‌కల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నీటిలో ఓ మహిళా మృతదేహం లభ్యమైనట్లు సమాచారం అందించింది. వెంటనే కుటుంబ సభ్యులు సంప్రదించి మృతదేహాన్ని గుర్తు పట్టారు. అయితే ప్రమాదవశాత్తు నీటిలో పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


