సౌతిండియా సైన్స్‌ఫెయిర్‌ను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

సౌతిండియా సైన్స్‌ఫెయిర్‌ను విజయవంతం చేయాలి

Jan 9 2026 11:17 AM | Updated on Jan 9 2026 11:17 AM

సౌతిండియా సైన్స్‌ఫెయిర్‌ను విజయవంతం చేయాలి

సౌతిండియా సైన్స్‌ఫెయిర్‌ను విజయవంతం చేయాలి

● ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్‌ రమేశ్‌ ● 2026 సైన్‌ ్స ఫెయిర్‌ ఏర్పాట్లపై సమీక్ష

● ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్‌ రమేశ్‌ ● 2026 సైన్‌ ్స ఫెయిర్‌ ఏర్పాట్లపై సమీక్ష

రామచంద్రాపురం (పటాన్‌చెరు): సౌత్‌ ఇండియా సైన్స్‌ ఫెయిర్‌ నిర్వహణ రాష్ట్రస్థాయి సైన్స్‌ ఫెయిర్‌ కంటే భిన్నంగా ఉంటుందని ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్‌ రమేశ్‌ పేర్కొన్నారు. ముత్తంగి డివిజన్‌ పరిధిలోని గాడియం ఇంటర్నేషనల్‌ స్కూల్లో ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న సౌత్‌ ఇండియా సైన్స్‌ ఫెయిర్‌ ఏర్పాట్లపై గురువారం సన్నాహక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ రమేశ్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ పాండు, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా 22 కమిటీలకు సంబంధించిన కన్వీనర్లతో చర్చించారు. ఈ సందర్భంగా ఎస్సీఈఆర్‌ డైరెక్టర్‌ రమేశ్‌ మాట్లాడుతూ... వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థుల భాష, ఆహార అలవాట్లు, సాంస్కృతిక భిన్నతలను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాలు నిర్వహణ చేయాల్సి ఉంటుందన్నారు. అనంతరం అదనపు కలెక్టర్‌ పాండు మాట్లాడుతూ...జిల్లాకు వచ్చిన ఈ ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా నోడల్‌ అధికారి లింభాజీ, జిల్లా సైన్స్‌ అధికారి సిద్ధారెడ్డి, గాడియం స్కూల్‌ ఏజీఎం ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement