పోషకాహారంతోనే ఆరోగ్యం
ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలోసబ్ కలెక్టర్ ఉమాహారతి
నారాయణఖేడ్: పోషక విలువలతో కూడుకున్న వంటకాలతోనే ఆరోగ్యమని సబ్ కలెక్టర్ ఉమాహారతి పేర్కొన్నారు. మనూరు మండలంలోని మాయికోడ్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన ఫుడ్‌ఫెస్టివల్‌ను ఉమాహారతి లంఛనంగా ప్రారంభించారు. ఇందులో పాఠశాల విద్యార్థులు వివిధ రకాల తెలంగాణ వంటకాలను ప్రదర్శించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. విద్యార్థులను వంటకాలు, వాటి ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సైతం పలు వంటకాల గురించి వివరించగా..సబ్ కలెక్టర్ వారిని అభినందించారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీ తనిఖీ
మనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సబ్ కలెక్టర్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు సమయపాలన పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.


