వాటి కేంద్రంగానే బల్దియా కార్యకలాపాలు
బల్దియా సర్కిల్‌పై ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సూచన
పటాన్‌చెరు: ప్రజల సౌకర్యార్థం పటాన్‌చెరు, రామచంద్రాపురం కేంద్రాలుగానే బల్దియా సర్కిల్ కార్యకలాపాలు కొనసాగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్‌ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని తెల్లాపూర్‌కు తరలించారని కార్యాలయాన్ని స్థానికంగానే కొనసాగించాలని..లేనిపక్షంలో ప్రజలతోపాటు పాలనాపరంగా తీవ్ర ఇబ్బందులు నెలకొంటాయన్నారు. అమీన్‌పూర్ కేంద్రంగా నూతనంగా ఏర్పాటు చేసిన సర్కిల్ కార్యాలయాన్ని రామచంద్రపురం కేంద్రంగా కొనసాగించాలని కమిషనర్‌ను కోరారు. నూతన డివిజన్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు కమిషనర్ కర్ణన్ ఎమ్మెల్యేకు తెలిపారు.


