పట్టించుకుంటే పర్యాటక శోభ
జహీరాబాద్: జహీరాబాద్‌కు సమీపంలో గల నారింజ ప్రాజెక్టును ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా మారనుంది. జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామ శివారులో గల నారింజ ప్రాజెక్టు జహీరాబాద్–బీదర్ రహదారిపై ఉంది. ఐదు దశాబ్దాల క్రితం వ్యవసాయ భూముల సాగు కోసం దీనిని నిర్మించారు. ఈ ప్రాజెక్టు బీదర్ రహదారిపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రహదారిపై రాకపోకలు సాగించే వారు రిజర్వాయర్‌ను చూడటం, దీని గురించి తెలుసుకుని వెళ్తుంటారు. జహీరాబాద్–బీదర్ రహదారి వైపు సుమారు రెండు కిలోమీటర్ల మేర పొడవు ఈ నారింజ ప్రాజెక్టు ఉంది. దీనిని రోడ్డు వైపు ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. ట్యాంక్‌బండ్‌గా మారిస్తేతే పర్యాటకులతో సందడిగా మారుతుందని పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు. ట్యాంక్‌బండ్‌గా మార్చడంతోపాటు పలు అభివృద్ధి పనులు చేపడితే దారిన వెళ్లే వారే కాకుండా జహీరాబాద్ పట్టణ ప్రజలతోపాటు పరిసర గ్రామాల ప్రజలు ఆహ్లాదం కోసం సందర్శించే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకుగాను ప్రభుత్వం నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
నిర్మాణం పూర్తిచేస్తే పర్యాటకులకు ఆహ్లాదం
నారింజ ప్రాజెక్టు ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తే పర్యాటకులు సేదతీరేందుకు ఉపయోగపడనుంది. దీనికి దగ్గరలోనే సిద్ధివినాయక దేవాలయం కూడా ఉండటంతో అక్కడికి ప్రతీ నెల సంకట చవితి రోజున వేలాదిమంది భక్తులు దర్శనం కోసం పాదయాత్రగా వెళ్తుంటారు. వారు కూడా సేదతీరేందుకు సౌకర్యంగా మారుతుంది. జహీరాబాద్ ప్రాంతంలో చెప్పుకోదగిన పార్కులు, పర్యాటక కేంద్రాలు లేనందున నారింజ ప్రాజెక్టును సందర్శించేందుకు ప్రజలు ఆసక్తి చూపే అవకాశం ఉంటుందనే చెప్పవచ్చు.
అంచనాల తయారీలో అధికారులు
ప్రాజెక్టును ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు నీటిపారుదల శాఖ అధికారులు అంచనాల తయారీలో నిమగ్నమయ్యారు. రహదారి వైపున 6 మీటర్ల వెడల్పుతో బండింగ్ నిర్మాణం, బతుకమ్మ ఘాట్, రెయిలింగ్ నిర్మాణం, చిన్న పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఆటవస్తువులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కట్ట 3 నుంచి 6 మీటర్ల వెడల్పు కోసం ప్రతిపాదించనున్నారు. కట్టచుట్టూ, నీటివైపు వెళ్లినా కింద పడకుండా రెయిలింగ్ నిర్మించనున్నారు. సేదతీరేందుకు గార్డెనింగ్, సిబ్బంది నివాసం ఉండేందుకు వీలుగా డబుల్ బెడ్‌రూం, అవసరమైనప్పుడు ఉపయోగించుకునేందుకు జనరేటర్, వర్కర్ల కోసం రెండు గదులు, గెస్ట్‌హౌస్ నీరు ఉండే వైపున బండపరుపులు వేసి రాళ్లు పేర్చడం వంటి పనుల్ని ప్రతిపాదించనున్నట్లు తెలిసింది.
నిధులు కేటాయిస్తే నారింజకు మహర్దశ
ట్యాంక్‌బండ్‌గా
అభివృద్ధి చేసే అవకాశం
బీదర్ రహదారిపై ఉండటం కూడా
అనుకూల అంశం
పర్యాటకంగా అభివృద్ధి చేయాలని
స్థానికుల డిమాండ్


