ఫొటోలతో ఓటర్ల జాబితా ప్రచురించాలి | - | Sakshi
Sakshi News home page

ఫొటోలతో ఓటర్ల జాబితా ప్రచురించాలి

Jan 8 2026 9:35 AM | Updated on Jan 8 2026 9:35 AM

ఫొటోల

ఫొటోలతో ఓటర్ల జాబితా ప్రచురించాలి

కలెక్టర్‌ ప్రావీణ్య

సంగారెడ్డి జోన్‌: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈనెల 12న ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలని కలెక్టర్‌ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలిసి ఆమె హాజరయ్యారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ఈనెల 13న పోలింగ్‌ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితాను ప్రచురించి వాటిని టీ పోల్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. అదేవిధంగా ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్‌ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను వార్డుల వారీగా ఆయా స్టేషన్ల వద్ద ప్రచురించాలన్నారు.

జాబ్‌మేళాలో

34మందికి ఉద్యోగాలు

జహీరాబాద్‌: మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో జహీరాబాద్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జాబ్‌మేళాకు మంచి స్పందన లభించింది. ఈ జాబ్‌మేళాలో 34 మంది ఎంపికయ్యారు.

9న ‘మెగా జాబ్‌ మేళా’

పటాన్‌చెరు టౌన్‌: పటాన్‌చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ విజ్ఞాన కేంద్రం, నిర్మాణ్‌.ఆర్గ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 9న మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు పటాన్‌చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ టీఎస్‌ కేసీ కో ఆర్డినేటర్‌ విమల ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ మెగా జాబ్‌మేళా ద్వారా పటాన్‌చెరు, పరిసర ప్రాంతాల ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌, డిగ్రీ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వారు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

సమాజ సేవలో

భాగస్వామ్యమవ్వాలి

సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జీ కవితాదేవి

ఝరాసంగం(జహీరాబాద్‌): ప్రతీ విద్యార్థి చదువుతో పాటు పమాజ సేవలో భాగస్వామ్యం కావాలని జహీరాబాద్‌ సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జీ కవితాదేవి పేర్కొన్నారు. జహీరాబాద్‌ పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ఝరాసంగంలో చేపట్టిన ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరాన్ని ఆమె మంగళవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు తెలుసుకుని వాటిపై అవగాహన పెంచుకోవటం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడ్డాకే వివాహాలు చేసుకోవాలని హితవు చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చింతల హరికుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆర్గనైజర్‌లు వెంకట్‌రామ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

శాసీ్త్రయపద్ధతుల్లో

పప్పుధాన్యాల సాగు

గొటిగార్‌పల్లిలో రైతు క్షేత్ర దినోత్సవం

జహీరాబాద్‌: పప్పుధాన్యాల సాగుకు శాసీ్త్రయ పద్ధతుల అనుసరణ ఎంతో అవసరమని సీనియర్‌ శాస్త్రవేత్త సి.వరప్రసాద్‌ పేర్కొన్నారు. మోడల్‌ పల్స్‌ విలేజ్‌ కార్యక్రమంలో భాగంగా మొగుడంపల్లి మండలంలోని గొటిగార్‌పల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన రైతు క్షేత్ర దినోత్సవంలో ఆయన పాల్గొని డీడీఎస్‌–కేవీకే ఆధ్వర్యంలో కందిపంట సాగుపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. కంది పంట సాగు పద్ధతులపై పంటల యాజమాన్యం, సస్యరక్షణ చర్యలపై పలు సూచనలు చేశారు. మెరుగైన రకాల ఎంపిక, విత్తనశుద్ధి, పోషక యాజమాన్యం, సమగ్ర కీటక–వ్యాధి నియంత్రణ, దిగుబడుల పెంపు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు రైతులకు ఆయా అంశాలపై సూచనలు చేశారు.

ఫొటోలతో ఓటర్ల  జాబితా ప్రచురించాలి
1
1/2

ఫొటోలతో ఓటర్ల జాబితా ప్రచురించాలి

ఫొటోలతో ఓటర్ల  జాబితా ప్రచురించాలి
2
2/2

ఫొటోలతో ఓటర్ల జాబితా ప్రచురించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement