పేట మున్సిపల్ అభివృద్ధికి కృషి
సదాశివపేట(సంగారెడ్డి): పట్టణంలో నెలకొన్న ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకోసం అవసరమైన నిధుల మంజూరుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని సాయినగర్ కాలనీ నుంచి శ్రీ కృష్ణమందిరం వరకు రూ.50 లక్షల నిధులతో పూర్తయిన సెంటర్ లైటింగ్ సిస్టమ్ ప్రారంభోత్సవం, పాత మున్సిపల్ భవనం స్థలంలో రూ.కోటితో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపన, 65వ నంబర్ జాతీయ రహదారి కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రూ.2 కోట్ల నిధులతో సెంటర్ లైటింగ్ డివైడర్ పనులకు భూమిపూజ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ...గత ప్రభుత్వం మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు రూ.25 కోట్ల నిధులు మంజూరు చేయగా టెండర్ ప్రక్రియ పూర్తయి కొంత అభివృద్ధి జరిగాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని తిరిగి ఆ నిధులను టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి మంజూరు చేయించి మిగిలిపోయిన అభివృద్ధి పనులు పూర్తి చేయించాలని కోరారు. నిర్మలారెడ్డి మాట్లాడుతూ..ప్రజా సంక్షేమ పథకాల అమలుతోపాటు పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మునిపల్లి సత్యనారాయణ, పట్నం విజయలక్ష్మి, అపర్ణపాటిల్, మాజీ కౌన్సిలర్లు కోవూరి శంకర్‌గౌడ్, నాగరాజ్‌గౌడ్, గుండురవి, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
రూ.3.50 కోట్ల అభివృద్ధి పనులకు
ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్,
టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి


