తప్పుల తడక! మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా విడుదల
ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్స్
ఫిబ్రవరి 2 నుంచి మూడు విడతల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతీ బ్యాచ్‌కు 25 మంది విద్యార్థుల చొప్పున ఐదు రోజులపాటు నిర్వహిస్తారు. సీసీ కెమెరాలున్న కళాశాలలకు మాత్రమే ప్రాక్టికల్స్ పరీక్షా కేంద్రం కేటాయించనున్నారు. సీసీ కెమెరాలు లేని ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు సీసీ కెమెరాలున్న సమీపంలోని ప్రభుత్వ కళాశాలకు వచ్చి పరీక్షలు జరపాల్సి ఉంటుంది.
ఈ ఏడాది కూడా నిఘా నీడలోనే పరీక్షలు జరగనున్నాయి. సీసీ కెమెరాల నీడలో జరగనున్న పరీక్షలను కళాశాలలో సీసీ కెమెరాలతో అనుసంధానించిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా జిల్లా కేంద్రంతోపాటు, ఇంటర్‌బోర్డు అధికారులు పర్యవేక్షించనున్నారు. గతేడాది ఒక్కో కళాశాలకు రూ.25వేల చొప్పున కేటాయించిన ఇంటర్‌బోర్డు అందులోంచి రూ.12వేల చొప్పున నిధులు సీసీ కెమెరాలకు కేటాయించింది. ఈ నిధులతో అన్ని కళాశాలల పరీక్షా కేంద్రాల్లో హై రిజుల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేయించింది. ఈ కెమెరాల నిఘా నీడలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. లైవ్‌లో అధికారులు పరీక్షల నిర్వహణ పరీక్షిస్తూ పారదర్శకత, సమగ్రతతోపాటు, భద్రతతను నిర్ధారించాలని భావిస్తున్నారు.
నిఘా నీడలోనే..


