జిల్లాకు విశేష సేవలందించారు
సంగారెడ్డి జోన్: జిల్లాలో విధులు నిర్వహించి పదోన్నతి పొంది బదిలీ అయిన అధికారులను బుధవారం కలెక్టరేట్‌లో సన్మానించారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కలెక్టర్‌గా పదోన్నతి పొంది నల్లగొండ జిల్లాకు బదిలీ అయ్యారు. జిల్లా యువజన క్రీడాధికారి ఖాసీంబేగ్, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్‌రావులు బదిలీ అయ్యారు. కలెక్టరు ప్రావీణ్యతోపాటు అధికారులు హాజరై పూలమాల, శాలువాతో సన్మానించి, జ్ఞాపికలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత రెండున్నరేళ్లుగా జిల్లా అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ జిల్లాకు విశేష సేవలందించారని ప్రశంసించారు. స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించడంలో ఆయన పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పాండు, మాధురి, సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య


