ప్రారంభమైన అంతర్రాష్ట్ర క్రికెట్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన అంతర్రాష్ట్ర క్రికెట్‌ పోటీలు

Jan 8 2026 9:35 AM | Updated on Jan 8 2026 9:35 AM

ప్రారంభమైన అంతర్రాష్ట్ర క్రికెట్‌ పోటీలు

ప్రారంభమైన అంతర్రాష్ట్ర క్రికెట్‌ పోటీలు

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ బాగారెడ్డి స్టేడియం అంతర్రాష్ట్ర కీజర్‌ యాఫై గోల్డ్‌కప్‌ క్రికెట్‌ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. జహీరాబాద్‌ కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సుభాష్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని కరచాలనం చేశారు. ఎనిమిది రోజుల పాటు కొనసాగే క్రికెట్‌ టోర్నమెంట్‌లో పలు రాష్ట్రాల నుంచి 16 జట్లు పాల్గొంటున్నాయి. విజేత జట్టుకు ఫస్ట్‌ ఫ్రైజ్‌ కింద రూ. 7 లక్షల నగదుతో పాటు గోల్డ్‌ కప్‌, రన్నరప్‌కు జట్టుకు రూ.4 లక్షల నగదుతో పాటు జ్ఞాపిక అందజేయనున్నారు.

మొదటి మ్యాచ్‌లో సేవాలాల్‌ జట్టు విజయం

క్రికెట్‌ టోర్నమెంట్‌ మొదటి మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన అనస్‌ జట్టుపై జహీరాబాద్‌ సేవాలాల్‌ జట్టు 23 పరుగల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సేవాలాల్‌ జట్టు నిర్ణీత 18 ఓవర్లలో 163 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్‌కు దిగిన అనస్‌ జట్టు 9 వికెట్లకు 140 పరుగులు మాత్రమే చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement