సైన్స్ ఫెయిర్ పోటీల్లో సత్తాచాటిన గుమ్మడిదల విద్యార్
జిన్నారం(పటాన్‌చెరు): గుమ్మడిదల పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి లక్ష్మీప్రసన్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ పోటీల్లో ప్రతిభ చాటింది. ఉపాధ్యాయురాలు శోభారాణి ప్రోత్సాహంతో లక్ష్మీప్రసన్న స్మోక్ క్యాన్సర్ ప్రాజెక్టును ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా పర్యావరణ కాలుష్యంతో నియంత్రణ అంశాల్లో రూపొందించిన ఈ ప్రాజెక్టు పోటీల్లో ప్రముఖుల నుంచి ప్రశంసలను అందుకుంది. విద్యార్థి ప్రతిభను పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు.
టీచర్లకు టెట్ నిబంధన
తొలగించాలి: ఎస్టీయూ


