జల్సాల కోసమే దొంగతనాలు
● ఏడుగురు మైనర్ నిందితులు రిమాండ్ ● వివరాలు వెల్లడించిన ఎస్సై ప్రశాంత్
అక్కన్నపేట(హుస్నాబాద్): చోరీలకు పాల్పడిన మైనర్ నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఎస్‌ఐ చాతరాజు ప్రశాంత్ స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని రామవరం, గండిపల్లి గ్రామాల్లో వరుసగా ధాన్యం బస్తాల చోరీలు జరగగా..పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. అలాగే మండలంలోని గౌరవెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లను అపహరించారు. మద్దూరు ప్రభుత్వ పాఠశాల తాళాలు పగులగొట్టి ల్యాప్‌టాప్‌లను ఎత్తుకెళ్లినట్లు విచారణలో మైనర్ బాలురు ఒప్పుకున్నారు. ఈ చోరీలకు పాల్పడిన మైనర్లది మండలంలోని బంజార హిల్స్‌తండా, సేవాలాల్ మహారాజ్‌తండా, దూల్మిట్ట మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని హనుమతండాలకు చెందిన మొత్తం ఏడుగురు మైనర్ నిందితులను అరెస్టు చేసి జువైనెల్ జస్టిస్ కోర్టులో హాజరుపరిచా రు. కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న న్యాయ స్థానం వారిని జువైనెల్ హోమ్‌కు తరలించాలని సూచించింది. ఈ కేసును ఛేదించిన ఎస్‌ఐను ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్ అభినందించారు.


