వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు అదృశ్యం
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని ముట్రాజ్‌పల్లి గామానికి చెందిన ఓ వ్యక్తి అదృశ్యం సంఘటన మండలంలోని ముట్రాజ్‌పల్లిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఉలా ఉన్నాయి. ముట్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన బంజ రవి అనార్యోగంతో ఈనెల 6న ఉదయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య స్రవంతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రవి వ్యసాయం పొలం, పెద్దచెరువు సమీపంలో అతని పొలంవద్ద సెల్‌ఫోన్, ఒక చెప్పు కనిపించడంతో గ్రామస్తుల ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లకు సమాచారం ఇచ్చి వెతికారు. అయినా ఎలాంటి ఆచూకీ లభించలేదు.
మతిస్థిమితం లేని వృద్ధురాలు..
చేగుంట(తూప్రాన్): మతిస్థిమితం లేని వృద్ధురాలు అదృశ్యమైన సంఘటన పొలంపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. పొలంపల్లి గ్రామానికి చెందిన కిష్టపురం పెంటవ్వ అనే వృద్ధురాలు మతిస్థిమితం కోల్పోయింది. ఈ క్రమంలో మంగళవారం పెంటవ్వ ఇంట్లోంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లేనందున వృద్ధురాలి కొడుకు నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
తిరుమలలో కోనాపూర్ వాసి..
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని కోనాపూర్ వాసి తిరుమలలో అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కోనాపూర్‌కి చెందిన చిరంజీ వీరన్న(62) తన మిత్రుడితో కలిసి తిరుమలలో వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. ఈనెల 2న తిరుమల కొండపై బస చేసిన తర్వాత బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దీంతో తోటి మిత్రుడు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. బంధువులను, స్నేహితులను విచారించినా ఫలితం లేకపోవడంతో బుధవారం తిరుమల కొండపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరికై న ఆచూకీ తెలిస్తే 9704953117, 9912256188 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు అదృశ్యం
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు అదృశ్యం


