బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
హత్నూర(సంగారెడ్డి): బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రం శివారులోని కొన్యాల గేటు వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మండలంలోని చిక్ మద్దూర్‌కి చెందిన పుట్టి రమేష్(40) భార్య లక్ష్మితో మంగళవారం రాత్రి గొడవపడి దుస్తులు తీసు కొని బైక్‌పై బయలుదేరాడు. అతివేగంగా వెళ్తున్న ఆయన కొన్యాల గేటు వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రమేష్‌కు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ప్రమాదం రాత్రి జరగడంతో బుధవారం ఉద యం రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషయంపై భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.మృతుడికి భార్యతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి


