షార్ట్ సర్క్యూట్‌తో కిరాణ షాపు దగ్ధం
కంది(సంగారెడ్డి): షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి కిరాణా షాపు దగ్ధమైంది. మండల కేంద్రంలోని నాల్గో వార్డులో సంగారెడ్డికి చెందిన మామిళ్ల నాగరాజు 13 ఏళ్లుగా కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. 15 నెలల క్రితం కంటైనర్‌ను కొనుగోలు చేసి అందులో కిరాణా షాపు నడుపుతున్నాడు. అయితే మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో రోజువారీగా షాపును మూసేసి ఇంటికి వెళ్లి పోయాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో కిరాణాషాప్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు నాగరాజుకు సమాచారం అందజేశారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అప్పటికే షాపు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.18లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని షాపు యజమాని బోరున విలపించాడు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.


