8 రోజులు..16 జట్లు
● నేటి నుంచి అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలు
● ఆహ్వాన కమిటీ ప్రతినిధి రాములునేత
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ బాగారెడ్డి స్టేడియం అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలకు సిద్ధమైంది. బుధవారం నుంచి ఈ నెల 14 వరకు కీజర్ యాఫై క్రికెట్ టోర్నమెంట్‌కు బాగారెడ్డి స్టేడియం ముస్తాబైంది. ఈ మేరకు ఆహ్వాన కమిటీ అధికార ప్రతినిధి రాములు నేత టోర్నమెంట్ వివరాలను మంగళవారం విలేకరులకు వెల్లడించారు. గత నాలుగేళ్ల నుంచి కీజర్ యాఫై అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా స్థానిక బాగారెడ్డి స్టేడియంలో నిర్వహించే క్రికెట్ పోటీలకు దేశంలోని 16 జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. విజేత జట్టుకు ఫస్ట్ ఫ్రైజ్ కింద రూ.7 లక్షల నగదుతో పాటు ట్రోఫీ, రన్నరప్‌కు జట్టుకు రూ.4 లక్షల నగదుతోపాటు జ్ఞాపికను అందజేస్తామన్నారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సీరీస్‌లకు సంబంధించి నగదు బహుమతులను అందజేస్తామన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు హీరు రాథోడ్, అక్బర్, గోవర్థన్‌రెడ్డి, భీంరావు, జుబేర్, లష్కర్,మోహన్,ప్రవీణ్, ఫిరోజ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కరపత్రం విడుదల చేశారు.


