మున్సిపోల్స్‌లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగరాలి | - | Sakshi
Sakshi News home page

మున్సిపోల్స్‌లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగరాలి

Jan 6 2026 2:04 PM | Updated on Jan 6 2026 2:04 PM

మున్సిపోల్స్‌లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగరాలి

మున్సిపోల్స్‌లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగరాలి

ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌

సదాశివపేట(సంగారెడ్డి): అధికారం లేదని అధైర్యపడవద్దని బీఆర్‌ఎస్‌కు మంచివాతావరణం ఉందని ప్రజలంతా బీఆర్‌ఎస్‌వైపు చూస్తున్నారని, మీరంతా కలిసి క్రమశిక్షణ ఐక్యమత్యంతో పనిచేస్తే సదాశివపేట మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురవేయడం తఽథ్యమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా సోమవారం పట్టణ పరిధిలోని ఓ ఫాంహౌజ్‌లో 26 వార్డుల పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ హాజరై దిశానిర్ధేశనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి చైతన్య పరచాలని సూచించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆరు గ్యారంటీల హామీల అమలులో జరిగిన వైఫల్యాలను నాయకులు కార్యకర్తలు వార్డుల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలన్నారు. ఎన్నికలు వస్తున్నప్పుడు మాత్రమే కాంగ్రెస్‌ నాయకులు అభివృద్ధిపై మాట్లాడుతున్నారని విమర్శించారు. వార్డుల రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ఐకమత్యంతో పనిచేసి పార్టీ బలపర్చిన అభ్యర్థుల విజయానికి శ్రమించాలన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మల్లన్న, పార్టీ నాయకులు శివరాజ్‌పాటిల్‌, కొత్తగొల్ల కృష్ణ,కోడూరి రమేశ్‌, అంజయ్య, పెద్దగౌడ్‌, ముస్తఫా, విద్యాసాగర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, మక్సుద్‌, మోబిన్‌, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement