ఐక్యంగా ఉంటేనే హక్కుల పరిరక్షణ | - | Sakshi
Sakshi News home page

ఐక్యంగా ఉంటేనే హక్కుల పరిరక్షణ

Jan 6 2026 1:56 PM | Updated on Jan 6 2026 1:56 PM

ఐక్యంగా ఉంటేనే హక్కుల పరిరక్షణ

ఐక్యంగా ఉంటేనే హక్కుల పరిరక్షణ

ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

సిద్దిపేటకమాన్‌: ఓసీలందరూ ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులను కాపాడుకోగలమని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. హన్మకొండలో జనవరి 11న లక్ష మందితో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఓసీల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో సమరభేరి గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెడ్డి, వైశ్య, వెలమ, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి సంఘాలతో ఏర్పడిన రాష్ట్ర ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్‌రెడ్డి, జిల్లా మహిళా ఐకాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉమారెడ్డి, కృష్ణమూర్తి, వంగ శైలజ, శ్రీనివాస్‌, రవి, రాజేంద్రప్రసాద్‌, దామోదర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement