రాజయ్యకు విశిష్ట సాహితీ సేవ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

రాజయ్యకు విశిష్ట సాహితీ సేవ పురస్కారం

Jan 6 2026 1:56 PM | Updated on Jan 6 2026 1:56 PM

రాజయ్యకు విశిష్ట సాహితీ సేవ పురస్కారం

రాజయ్యకు విశిష్ట సాహితీ సేవ పురస్కారం

నారాయణఖేడ్‌: తెలుగు సాహిత్య సేవలో విశేషమైన కృషి చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఖేడ్‌కు చెందిన డాక్టర్‌ వడ్ల రాజయ్యకు విశిష్ట సాహితీసేవా పురస్కారం లభించింది. చిట్టితల్లి శతకంతోపాటు అనేక రచనలు చేసి ఆశావాది ప్రకాశరావు అవధానంపై పరిశోధనలు చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి రాజయ్య డాక్టరేట్‌ పట్టా పొందారు. సంగారెడ్డి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో సోమవారం రాజయ్యను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఖేడ్‌ రసగీతి సాహితీసంస్థ అధ్యక్షులు మహారెడ్డి మహిపాల్‌ రెడ్డి, సాహితీ మిత్రమండలి సభ్యులు భూమయ్య, నాగభూషణం, చంద్రకాంత్‌, జగదీష్‌, చంద్రశేఖర్‌ తదితరులు రాజయ్యను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement