తుదిపోరు అర్హత దిశగా గుజరాత్, కేరళ
పోటీలో తలపడనున్న కేరళలోని కొల్లాం నవోదయ విద్యార్థుల బృందం, గుజరాత్‌లోని వల్సాడ్ నవోదయ విద్యార్థులు
వర్గల్ నవోదయ ఎంపీ హాల్ వేదికగా మంగళవారం ఉదయం 11 గంటలకు యూత్ పార్లమెంట్ పోటీలు ప్రారంభమవుతాయి. విద్యాలయ స్థాయి నుంచి ఒక్కో మెట్టు అధిగమించిన గుజరాత్ రాష్ట్రంలోని వల్సాడ్, కేరళలోని కొల్లాం నవోదయ విద్యార్థులు జాతీయ స్థాయి పోరులో అర్హత కోసం ఇక్కడ తలపడనున్నారు. లోక్‌సభ స్పీకర్, ప్రధానమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, పార్లమెంట్ సభ్యులు, అధికారగణం తదితర 55 మంది సభ్యులతో అచ్చం పార్లమెంట్ సమావేశాలు ప్రతిబింబించేలా విద్యార్థులు తమ ప్రదర్శనతో ‘మాక్ పార్లమెంట్’ను ఆవిష్కరించనున్నారు. వాడివేడి చర్చలు, వాదో పవాదాలు, బిల్లుల ఆమోదం, తీర్మానాలతో పార్లమెంటేరియన్ల మాదిరి సత్తాచాటనున్నారు.
తుదిపోరు అర్హత దిశగా గుజరాత్, కేరళ


